»The Indian Bowler Prasidh Krishna Worst Record In Third T20 Australia Vs India Match
Prasidh Krishna: చెత్త రికార్డును బ్రేక్ చేసిన భారత బౌలర్
టీ20 ప్రపంచ కప్ 2023లో టీమ్ ఇండియా తరఫున హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఈ టోర్నీలో చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. నిన్న ఆసీస్ జట్టుతో జరిగిన మూడో మ్యాచులో చివరి ఓవర్లో ఏకంగా 23 రన్స్ ఇచ్చి భారత్ ఓటమికి కారణమయ్యాడు.
The Indian bowler Prasidh Krishna worst record in third t20 australia vs india match
భారత్(bharat), ఆస్ట్రేలియా(australia) మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న మూడో మ్యాచ్ గౌహతిలోని క్రికెట్ స్టేడియంలో జరుగగా టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఓటమికి కారణం ఓ బౌలర్ అని క్రీడాభిమానులు అంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ మొదట 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆటకు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 225 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ 48 బంతుల్లో 104 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలోనే భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ(Prasidh Krishna) ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 68 పరుగులు ఇచ్చాడు. దీంతో T20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ కృష్ణ ఎకానమీ రేటు 17గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం విశేషం. అంతేకాదు ఆసీస్ జట్టుకు చివరి ఓవర్లో 21 రన్స్ అవసరం కాగా..ఇక భారత్ జట్టు గెలుస్తుందని అందరు అనుకున్నారు. కానీ లాస్ట్ ఓవర్లోనే ప్రసిద్ధ్ 23 పరుగులు ఇవ్వడంతో గెలుపు ఆసీస్ ఖాతాలో చేరింది.
ప్రసిద్ధ రికార్డు కంటే ముందు ఈ రికార్డు స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్(yuzvendra chahal) పేరిట ఉంది. 2018లో సెంచూరియన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చాహల్ 4 ఓవర్లలో మొత్తం 64 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఆ సమయంలో ఎకానమీ రేటు 16గా ఉంది. ఈ జాబితాలో మూడో పేరు ఎడమ చేతి వాటం 2022లో గౌహతి మైదానంలో దక్షిణాఫ్రికాపై 15.5 ఎకానమీ రేటుతో 4 ఓవర్లలో మొత్తం 62 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు కూడా తీసిన ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(arshdeep singh) పేరిట ఉంది. దీంతో ఈ ముగ్గురు భారత బౌలర్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు.
అయితే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20 ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(australia) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 215.79 స్ట్రైక్ రేట్‌తో 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 123 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.