»Sunil Gavaskar Shared Photos Of Sachin Railway Station
Sachin Tendulkar: సచిన్ పేరుతో రైల్వేస్టేషన్..గవాస్కర్ పోస్ట్ వైరల్
సచిన్ పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ గురించి ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఆనందంగా ఉందన్నారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ప్రపంచ క్రికెట్ (International Cricket)లో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన పేరుపై అనేక రికార్డులు ఉన్నాయి. బీసీసీఐ (BCCI) ఆయన విగ్రహాన్ని కూడా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసింది. తాజాగా ఆయన పేరుతో ఏకంగా ఓ రైల్వే స్టేషనే (Railwaystation) ఉందని గవాస్కర్ (sunil Gavaskar) ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇప్పటి వరకూ చాలా మందికి సచిన్ పేరుపై ఓ రైల్వే స్టేషన్ ఉందని తెలియదు.
తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (sunil Gavaskar) సచిన్ రైల్వే స్టేషన్ (sachin Railway station) పేరును అందరికీ పరిచయం చేశాడు. ఇన్‌స్టాలో ఆయన ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించి ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. గత శతాబ్దం వాళ్లు ఎంతో మందు చూపుతో సచిన్ రైల్వే స్టేషన్‌ను నెలకొల్పారని, క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్, తన ఫేవరేట్ క్రికెటర్, తనకెంతో ఇష్టమైన వ్యక్తి పేరును రైల్వే స్టేషన్‌కు పెట్టడం ఆనందంగా ఉందంటూ గవాస్కర్ తన పోస్ట్‌లో తెలిపారు. గుజరాత్‌కు సమీపంలోని సూరత్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉంది.
వన్డే క్రికెట్ ఫార్మాట్లో రికార్డు స్థాయిలో 49 శకాలు, 96 అర్ధ శతకాలు బాదిన మొదటి వ్యక్తి సచిన్ టెండుల్కర్ అని, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసింది కూడా సచినే అని గవాస్కర్ తెలిపాడు. అలాంటి గ్రేట్ క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా సచిన్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ మెంటార్‌గా కొనసాగుతున్నారు.