Chiranjeevi: సోషల్ మీడియా షేక్ చేస్తున్న చిరు, చరణ్!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకు అందుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.
Chiranjeevi: ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చిరు, చరణ్ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. సినీ రంగంలో చేసిన సేవలకుగాను చిరంజీవికి పద్మ విభూషణ్‌కు అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హజరయ్యారు. ఇక చిరు పురస్కారం అందుకోవడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత.. తండ్రితో కలిసి రామ్ చరణ్ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిరంజీవి కూడా అవార్డు అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘కళామతల్లికి, కళా రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి, నన్ను ప్రేమించి అభిమానించిన అందరికి, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్బంగా అభినందించిన వారికీ, నా నమస్సుమాంజలి’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమా చేస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.