ఫైనల్‌గా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్టేట్ ఇచ్చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. దీంతో.. సోషల్ మీడియాలో దేవర ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Devara: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దేవర ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి లిరికల్ సాంగ్ రిలీజ్ కానుందని గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. ఫైనల్‌గా ఇప్పుడు అఫీషియల్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్. అతి త్వరలోనే దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవెపు అనిరుధ్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు.
ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న మ్యూజిక్ కాన్సర్ట్‌లో.. అతి త్వరలోనే దేవర సాంగ్ రాబోతుంది అని ప్రకటించాడు. దీంతో అక్కడి ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే న్యూస్ బయటికి రాగానే.. అంచనాలు భారీగా పెంచుకున్నారు. రాను రాను ఈ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఎప్పుడెప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా టైగర్ బర్త్ డే గిఫ్ట్‌గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అనేసరికి సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది.
ప్రస్తుతం అనిరుద్ ఉన్న ఫామ్‌లో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఓ మాసివ్ ట్యూన్ పడితే మామూలుగా ఉండదు. అందుకే.. ఈ క్రేజీ కాంబినేషన్లో రానున్న మొదటి సాంగ్‌ని వినేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు నందమూరి అభిమానులు. ఈ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు కూడా ఇదే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి దేవర సాంగ్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.