హిందూ సంప్రదాయంలో పండుగలకు ప్రత్యేకత ఉంటుంది. అయితే అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని వస్తువులను కొనడం, దానం చేయడం వంటివి చేయాలి. మరి ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
Akshaya Tritiya: What to do today? What not to do?
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. లోహాలు, గాజు పాత్రలు కొనుగోలు చేయకుండా ఉండాలి. అలాగే ఈరోజు భవన నిర్మాణ పనులు ప్రారంభించకూడదు. విష్ణు మూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి ఆకులను తెంచకూడదు. మాంసం, ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఈరోజు పవిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక రచనలు కొనుగోలు చేసిన మంచిదే. లేదా విగ్రహాలు, బొమ్మలు, మత గ్రంథాలను కూడా ఇంటికి తీసుకురావచ్చు. అలాగే భూమి, ఇల్లు, కారు వంటివి కొన్న మంచిదే.
ఈరోజు మొక్కలు, పండ్లు కొనడం వల్ల జీవితంలో మంచి విషయాలు జరుగుతాయట. ఖరీదైనవి కొనలేని వాళ్లు రాక్ సాల్ట్, కొత్త కుండ వంటివి కూడా కొని ఇంటికి తీసుకురావచ్చు. వీటివల్ల సిరిసంపదలు ఇంట్లో ఉంటాయని ప్రజలు నమ్ముతారు. వీటితో పాటు శ్రీయంత్రం, పసుపు గవ్వలు, బార్లీ, తులసి, శంఖం కొనుగోలు చేయవచ్చు. వీటిని కొనుగోలు చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఇంట్లో సకలసంపదలు ఉండటంతో పాటు లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందట.