Paid Holiday : లోక్ సభ ఎన్నికలు నాలుగో విడతలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న పోలింగ్ జరగనుంది. ఇదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోనూ ఉప ఎన్నిక జరగనుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పని చేసే ఉద్యోగులు అందరికీ వేతనంతో కూడిన సెలవు(PAID HOLIDAY) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం( State GOVERNMENT) జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ రోజు పెయిడ్ హాలీడేని తప్పకుండా అమలు చేయాలని తెలిపింది. ఒక వేళ ఈ ఆదేశాలను ఎవరైనా పెడ చెవిన పెట్టినా, పాటించకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. ఈ నిబంధనను అంతా కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పింది. ఒక వేళ ఎవరైనా అమలు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
ఎన్నికల్లో పోలింగ్‌ను మరింత పెంచేందుకు గాను తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఓటర్లంతా ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. మే 13వ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సమయం అని తెలిపింది.