Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు (Shubman Gill) లక్కీ ఛాన్స్ వచ్చింది. ఐపీఎల్ సీజన్లో ఓ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఏర్పడింది. దీనిపై అధికార ప్రకటన రాలేదు కానీ.. కెప్టెన్ అవడం ఖాయం అని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌కు గిల్ నాయకత్వం వహిస్తాడు. ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకోవడంతో గిల్‌కు అవకాశం వచ్చింది.
గుజరాత్ టైటాన్స్‌కు గత రెండేళ్ల నుంచి పాండ్యా ఆడుతున్నాడు. ఒకసారి కప్ కూడా అందజేశాడు. అయితే ఆదివారం నాటి ట్రేడింగ్‌లో పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ లేరు. దీంతో ఆ జట్టును నడిపించేది ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కెప్టెన్సీ రేసులో గిల్ ముందు వరసలో ఉన్నారు.
గుజరాత్ రిటెన్షన్ జాబితాలో హార్దిక్ పాండ్యా పేరు ఉంది. నగదు ఒప్పందంలో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో గుజరాత్ జట్టుకు కొత్త కెప్టెన్ కావాల్సి ఉంది. పాండ్యా తర్వాత ఆ స్థాయిలో ఉన్నది గిల్ (Gill) మాత్రమే.. సో.. అతనికే నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీనిపై ఫ్రాంచేజీ, గిల్ స్పందించలేదు. అధికార ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.