Dinesh Karthik: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన దినేష్ కార్తిక్
గత 17 ఏళ్లుగా ఐపీఎల్లో బెస్ట్ ఫినిషిర్‌గా కొనసాగుతున్న దినేష్ కార్తిక్ ఈ లీగ్‌కు గుడబై చెప్పేశారు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న దినేష్ తన చివరి మ్యాచ్ ఆర్ఆర్తో ఆడారు. ఈ సందర్భంగా దినేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
Dinesh Karthik: దినేష్ కార్తిక్(Dinesh Karthik) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెస్ట్ ఫినిషర్‌గా, కీపర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజం చెప్పాలంటే ఐపీఎల్ ఆటతోటే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 2008లో ఐపీఎల్లో ఆరంగేట్రం చేశారు. ఆ తరువాత వివిధ ఫ్రాంచైజీలలో ఆడుతూ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులో రాణిస్తున్నారు. గత రాత్రి ఆటతో దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ 2లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌తో ఆయన ఐపీఎల్ ప్రస్థావనకు తెరపడింది. నిన్న ఆట ముగిసిన అనంతరం తోటి ఆటగాళ్లు దినేష్ కార్తిక్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. 16 ఏళ్ల క్రితం ఈ లీగ్‌లో దినేష్ కార్తిక్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫార్మెట్లో అద్భుతమైన ఫినిషిర్ రాణించారు.
ఈ మేరకు ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ అయిన జియో సినిమా సోషల్ మీడియా పోస్టులో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్‌కు గుడ్ బై చెబుతూ పోస్ట్ పెట్టింది. ఆట ముగిసిన తరువాత దినేష్ చేతి గ్లౌజ్‌లను తీసి ఆర్సీబీ క్రికెటర్లకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా దినేష్ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో విరాట్ కోహ్లీ డీకేను హత్తుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద కార్తీక్‌కు ఆర్సీబీ క్రికెటర్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 257 మ్యాచ్‌లు ఆడారు. అందులో 4842 పరుగులు చేశారు. దాంట్లో 22 ఫిఫ్టీలు ఉన్నాయి.