Do you know the records set by Virat Kohli in IPL?
Virat Kohli: విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో పరుగులవిహారం చేస్తున్నాడు. ఎన్నో రికార్డును సాధించాడు. తాజాగా మరో రికార్డును ఆయన ఖాతాలో చేరనుంది. ఇంకో 29 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగుల క్లబ్లో చేరుతారు. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి 8 మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఆ తరువాత పుంజుకుంది. వరుసగా గెలుస్తూ వచ్చింది. అలా ఆరు మ్యాచులను గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. బెంగళూర్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన విరాట్ 708 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నారు. మొత్తం 5 అర్ధ శతకాలు, ఒక శతకంతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో దూసుకుపోతున్నాడు.
ఐపీఎల్లో సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొహ్లీ కొనసాగుతున్నాడు. 2016లో 973 రన్స్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అది టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఈ సీజన్లో 708 పరుగులు చేశాడు. ఇక తన సొంత రికార్డ్ బ్రేక్ చేయాలంటే మరో 266 పరుగులు చేయాలి. అదేవిధంగా ఐపీఎల్లో 8 వేల పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 29 రన్స్ అవసరం. ఇక ఆర్ఆర్తో జరిగే ఎలిమినేటర్ మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ మాజీ యజమాని విజయ్ మాల్యా ట్విట్ చేయడం కూడా నెట్టింట్ చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్లో టైటిల్ గెలిచే అవకాశం ఉందని మాల్యా రాసుకొచ్చారు. ఆర్సీబీకి బెస్టాఫ్ లక్ చెప్పాడు.