Himanta Biswasharma: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం ఇంకా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే పాక్ అక్రమిత కశ్మీర్ భారత్లో విలీనం కావడం పక్కా అన్నారు. డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు చేశారని సచిన్ను అడిగితే సమాధానం ఉండదు.
అలాగే బీజేపీ 300 సీట్లతో గెలుపొంది.. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మథురలో శ్రీకృష్ణుడి దేవాలయం, వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయం నిర్మించడంతో పాటు పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పీవోకేపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదని, ఆ పార్టీపై హిమంత విమర్శలు చేశారు.