KRNL: ప్రధాన రహదారుల స్వచ్ఛతను మరింత వేగవంతం చేశామని, గత కొన్ని నెలలుగా నిర్వహణ లోపాల కారణంగా రోడ్లపైకి రాని స్వచ్ఛత యంత్ర వాహనాలను పునఃప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం కొండారెడ్డి బురుజు వద్ద స్వచ్ఛత యంత్రాలను పరిశీలించి, వాటి పనితీరును ఆయన సమీక్షించారు. నగర పరిశుభ్రతకు యంత్రాల వినియోగం ఎంతో దోహదపడతాయన్నారు.