»India Vs Australia 3rd T20 Match At Guwahati Stadium Win Prediction
India vs australia: 3వ T20 మ్యాచ్..సిరీస్ గెల్చేనా?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 ఈరోజు(నవంబర్ 28న) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టీమిండియా గెలవాలని చూస్తుండగా..మరోవైపు ఆసీస్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.
india vs australia 3rd t20 match at guwahati stadium win prediction
నేడు (నవంబర్ 28న) గౌహతిలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భాగంగా భారత్(bharat) మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(australia)తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ గేమ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు పోటిపడనుండగా..మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలు కానుంది.
ఈ మైదానంలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్‌లో ఛేజింగ్ జట్టు విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక్కడ ఒక్క మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 118 పరుగులకే భారత్‌ను చిత్తు చేసింది. కాగా రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200+ స్కోర్లు నమోదయ్యాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్ ‘స్పోర్ట్స్-18’, ‘కలర్స్ సినీప్లెక్స్’ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతో పాటు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం Jio సినిమా యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో మరో బంతి మిగిలుండగానే ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. గురువారం (నవంబర్ 23) విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేయగా, భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 235 పరుగులకు ఆలౌటైంది. ఇక Google గెలుపు సంభావ్యత(win prediction) ప్రకారం ఈరోజు భారత్ జట్టు గెలిచే అవకాశం 55% ఉంది.