today t20 india vs australia match win prediction telugu
ICC వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో భారత్(Bharath), ఆస్ట్రేలియా(australia) జట్లు తలపడిన కొన్ని రోజుల తర్వాత, నేడు మళ్లీ ఢీకొనబోతున్నాయి. అయితే ఈసారి ఫార్మాట్ మాత్రం భిన్నంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం(visakhapatnam)లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలుకానుంది. ప్రపంచకప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్ ఆసీస్‌పై భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను ఈ సంవత్సరం భారతదేశానికి నాల్గవ T20 కెప్టెన్, తర్వాత హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సూర్య ఇప్పటికే T20 ఫార్మాట్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది.
అయితే గతంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు 26 టీ20లు ఆడాయి. అందులో భారత్ 15, ఆస్ట్రేలియా 10 గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ జట్ల మధ్య గత 5 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 3, ఆస్ట్రేలియా 2 గెలిచాయి. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 25, 2022న హైదరాబాద్‌లో తలపడ్డాయి, సూర్యకుమార్ 36 బంతుల్లో 69 పరుగులతో ఆస్ట్రేలియాను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ రెండు జట్లకు విశాఖపట్నం కొత్త వేదిక కాదు. మార్చిలో ఇక్కడ జరిగిన వన్డేలో వీరిద్దరూ తలపడ్డారు. ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 117 పరుగులకు ఆలౌట్ చేసి 11 ఓవర్లలో స్కోరును చేజ్ చేసింది. పిచ్ బ్యాటింగ్, ఫీల్డింగ్ జట్లకు సమాన అవకాశాలను అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక గూగుల్ గెలుపు సంభావ్యత(google win prediction) ప్రకారం ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించే అవకాశం 54% ఉందని ప్రకటించింది. ప్రస్తుత వివరాలను బట్టి చూస్తే ఈ మ్యాచులో ఏ జట్టు గెలస్తుందో చెప్పేయండి మరి.
ఇది కూడా చూడండి: Cybercrime: ఒకే ఆన్లైన్ లావాదేవీలో రూ.1.59 కోట్లు పొగొట్టుకున్న హైదరాబాద్ మహిళ

