TG: ప్రజా సంక్షేమమే ఎన్డీయే లక్ష్యమని, అందుకే పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం బాధ్యత నెరవేర్చినట్లే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురు ధరలు తగ్గితేనే నిత్యావసరాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని, రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఆయన పేర్కొన్నారు.