AP: అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై CM చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలతో మున్సిపల్ శాఖకు సంబంధం లేదా అని ఆయన అధికారులను నిలదీశారు. భద్రతను పటిష్టం చేసేందుకు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణకు సూచించారు. దీనికి స్పందించిన మంత్రి, రాజధానిలో త్వరలోనే పూర్తిస్థాయిలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తామని CMకు హామీ ఇచ్చారు.