»Australia Vs New Zealand 27th Dharamshala Match Win Prediction
AUS vs NZ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తగ్గపోరు మ్యాచ్..గెలిచెదెవరు?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో నేటి ఉదయం మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు జట్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఈ కీలక మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది? వీటిలో ఎక్కువగా ఏ టీం గెలిచిందనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
Australia vs New Zealand 27th dharamshala match win prediction
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు 27వ మ్యాచ్ ఆస్ట్రేలియా(Australia), న్యూజిలాండ్(New Zealand) జట్ల మధ్య జరగనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇది కాసేపట్లో మొదలు కానుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగనుంది. ఎందుకంటే ప్రస్తుతం రెండు జట్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ రెండు జట్లు కూడా టాప్ 4 ఉండేందుకు ఈ మ్యాచ్ గెలుపు కీలకం కానుంది.
గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు 141 సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా 95 సార్లు, కివీస్ 34 సార్లు గెలుపొందాయి. ఏడు సార్లు మ్యాచ్‌ల ఫలితాలు రాలేదు. చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు (సెప్టెంబర్ 2022లో) ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 11 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాయి. అందులో ఆస్ట్రేలియా 8 గెలిచింది. బ్లాక్ క్యాప్స్ 3 విజయం సాధించింది.
మరోవైపు ధర్మశాల(dharamshala)లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత పేసర్లు 10 వికెట్లలో 7 వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ అందులో 5 వికెట్లు తీశాడు. బ్లాక్ క్యాప్స్ తరఫున పేసర్లు 5 వికెట్లలో 4 వికెట్లు తీశారు. ఇక గూగుల్ గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించే అవకాశం 60% ఉందని తెలిపింది. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.