యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మహా భారతం, సైన్స్ ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన కల్కి 2898 ఏడి సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు అమెరికా బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది. అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కల్కి.
Kalki 2898 AD: కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగా అమెరికాలో ఓపెన్ అయ్యాయి. అక్కడ బుకింగ్స్ ఓపెన్ అవడమే లేట్ అన్నట్టుగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు కొట్టి నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి. ఇక ఇప్పుడు సినిమా థియేటర్లోకి వచ్చాక అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్లో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది.
మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు రాబట్టింది. అంటే.. భారత కరెన్సీలో దాదాపు 92 కోట్లు వసూల్ చేసిందన్నమాట. ఇప్పటివరకు ఫస్ట్ వీకెండ్లో ఇంత మొత్తంలో రాబట్టిన సినిమా కల్కి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్‌లో టాప్ 2 మూవీస్ ప్రభాస్‌వే కావడం విశేషం. లేటెస్ట్గా కల్కి ఫస్ట్ ప్లేస్‌లోకి రాగా, బాహుబలి 2 తర్వాతి ప్లేస్‌లో నిలిచింది. ఇది ఒక రికార్డు అయితే.. ఇప్పటివరకు కెనడాలో రిలీజ్ అయినా తెలుగు సినిమాల్లో.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా కల్కి చరిత్ర సృష్టించింది.
ఆస్ట్రేలియాలో కూడా దుమ్ముదులిపేస్తోంది కల్కి. ఇదే కాదు.. ఓవరాల్‌గా విదేశాల్లో కల్కి పై కాసుల వర్షం కురుస్తోంది. సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ ఉండడంతో.. ఓవర్సీస్లో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా కల్కి సినిమా రికార్డ్స్ పరంగా కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసేలా ఉంది. మరి లాంగ్ రన్లో కల్కి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.