చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాక్ మరో సారి ఓటమి పాలయ్యింది. ఉత్కంఠ పోరులో సఫారీలు ఒక వికెట్ తేడాతో పాక్పై విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ (Pakistan) 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఓ దశలో సఫారీలు మెరుగైన స్థితిలోనే ఉన్నారు. కానీ, ఒత్తిడికి లోనై వెంటవెంటనే వికెట్లు అప్పగించి పెవిలియన్ కు చేరారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా(South Africa)ను మార్క్ క్రమ్ (91) పరుగులు చేసి ఆదుకున్నాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది.
వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమిస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. 271 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. మార్క్రమ్ (Markram)(91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సాద్ షకీల్ (52; 52 బంతుల్లో 7×4), బాబర్ అజామ్ (50; 65 బంతుల్లో 4×4, 1×6), షాదాబ్ ఖాన్ (Shadab Khan) (43; 36 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షంసి (4/60), జాన్సన్ (3/43) ఆ జట్టును దెబ్బ తీశారు. 1999 తర్వాత ప్రపంచకప్(World Cup)లో పాక్పై దక్షిణాఫ్రికాకు ఇదే విజయం. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ మళ్లీ గెలుపు రుచే చూడలేకపోయింది. గత మ్యాచ్లో అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న పాక్.. దక్షిణాఫ్రికాపై గొప్పగా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఆ జట్టు తొలిసారి వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది.