»Jd Laxminarayana Jd Who Showered Praises On Cm Jagans Rule
Jd Laxminarayana: సీఎం జగన్ పాలనపై జేడీ ప్రశంసలు
విమర్శించిన వారే ఒక్కసారిగా పొగిడితే.. ఆ మజా వేరే. వివిధ కేసుల్లో జగన్ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Jd Laxminarayana: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీశైలంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ చేపట్టిన నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు బాగున్నాని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో కృషి చేసిన వారికి మంచి ఫలితాలు ఉంటాయని జేడీ అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు అన్ని అందంగా ఉన్నాయి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొత్త రూపులు దిద్దుకున్నాయి. అంగన్వాడీలో చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్ఠికాహారం, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా బాధితుల వద్దకే వెళ్లి మందులు ఇవ్వడం వంటివి బాగున్నాయని తెలిపారు.
జేడీ లక్ష్మీనారాయణ చదువుకున్న స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. దీనికి స్థానిక ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డిని పిలిచేందుకు శ్రీశైలం వెళ్లారు. అక్కడ జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్నారు. అతను జేడీని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో జగన్ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన వ్యక్తి జగన్ పరిపాలనను అభినందించడంతో ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.