ప్రస్తుతం నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో వైసీపీ పాలనలో జరుగున్న అరాచకాలను విన్నారు. ఈ క్రమంలో ఆమె నిజం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Nara Bhuvaneswari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ‘నిజం గెలవాలి’ అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రజలు చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. నన్ను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డా. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా.. అని భువనేశ్వరి తెలిపారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోంది. నన్ను కలిసిన ప్రజలు చంద్రబాబు గారి పాలనలో… pic.twitter.com/JkbikmOc9h
నిజం గెలవాలి యాత్రలో భాగంగా ప్రస్తుతం భువనేశ్వరి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం, ఎర్రం రెడ్డిపాలెంలో సూరా మునిరత్నం, వసంతమ్మ కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబానికి ఆమె రూ.3 లక్షల చెక్కును అందించారు. తాజాగా చంద్రబాబు తన ప్రాణాలకు ముప్పు ఉందని రాసిన లేఖ భువనేశ్వరిని ఎంతగానో కలచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జైలు పరిస్థితులపై మొదటి నుంచి ఆందోళన ఉంది. జైల్లో ఉన్న నా భర్త క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నానని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నా ప్రార్థనలో భాగస్వామి కావాలి. ఇవన్నీ చంద్రబాబుకు రక్షణ కవచం కావాలని కోరారు.
The letter penned by @ncbn garu, in which he reveals the alleged threats to his life, has left me profoundly shaken. From the very beginning, we have voiced our concerns about the conditions he faces in prison. I request you all, the sisters of Andhra Pradesh, to join me in… pic.twitter.com/korj8nMgEe