తెలంగాణ (Telangana) ఎన్నికలు సమీపించే కొద్ది రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge) సమక్షంలో హస్తం గూటికి చేరారు.వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, నీలం మధు ముదిరాజ్(Neelam Madhu)..ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మల్లిఖార్జున ఖర్గే.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ (BRS) తరపున టికెట్ ఆశించిన నీలం మధు.. అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అధికారికంగా కాంగ్రెస్లో చేరిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy) మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ను గద్దె దింపేందుకే కాంగ్రెస్లో చేరానన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్నారు. ‘‘కుటుంబ పాలనను అంతం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోంది’’ అని రాజగోపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.