»Assam No Second Marriage Without Permission Assam Sarkar Warning To Employees
Assam: అనుమతి లేకుండా రెండో పెళ్లి కుదరదు.. ఎక్కడంటే..?
ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొదటి భార్య ఉండగా.. రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
Assam: ప్రభుత్వ ఉద్యోగులకు అసోం సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. భాగస్వామి జీవిస్తుండగానో మరో వివాహం చేసుకోవడం కుదరదని చెప్పింది. ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తే సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అసోం ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అసోం సివిల్ సర్వీసెస్‌లోని నిబంధనల వల్ల 1965లోని 26 ప్రకారం, భార్య జీవించి ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రెండో వివాహం చేసుకోకూడదు.
భాగస్వామి బతికుండగా రెండో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కొన్ని మతాల్లో రెండో వివాహం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఇలాంటి వారు తప్పకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమించితే.. బలవంతంగా పదవీ విరమణ చేయించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భర్త చనిపోయిన తర్వాత అతని భార్య ఫింఛను అర్హత విషయంలో గొడవలు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి గొడవలు పరిష్కరించడం చాలా కష్టమవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.