»Pakistan Vs South Africa 26th Match Win Prediction
PAK VS SA: పాకిస్థాన్ బ్యాటింగ్..ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికాను ఓడిస్తుందా?
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు పాకిస్థాన్(pakistan), సౌత్ ఆఫ్రికా(south africa) జట్ల మధ్య 26వ మ్యాచ్ మొదలైంది. ఇప్పటికే గత మ్యాచ్ ఆప్గాన్ పై ఓడిన పాక్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ఇక టాస్ గెల్చిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ రెండు జట్లలో ఏం జట్టు గెలుస్తుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
pakistan vs south africa 26th match win prediction
ప్రస్తుతం పాకిస్థాన్(pakistan) జట్టు డెంజర్ డోన్‌లో ఉందని చెప్పవచ్చు. ICC వన్డే ప్రపంచ కప్ 2023(icc odi world cup 2023)లో వరస విజయాలతో ప్రారంభించిన తర్వాత ఈ జట్టు..తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక గత మ్యాచులో ఆప్గానిస్థాన్ చేతిలో ఓడిపోవడం ఈ జట్టుకు అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 26వ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఓసారి చుద్దాం. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్డేడియంలో జరుగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా టీం కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకపై 428 పరుగులు, ఆస్ట్రేలియాపై 311 రన్స్, ఇంగ్లాండ్‌పై 399 రన్స్, బంగ్లాదేశ్‌పై 382 పరుగులు చేసి విజయం సాధించారు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇక పాకిస్థాన్, దక్షిణాఫ్రికా(south africa)జట్లు ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడాయి. ఇందులో పాకిస్థాన్ 30 మ్యాచ్‌లు గెలుపొందగా, సౌతాఫ్రికా 51 మ్యాచ్‌లు గెలిచింది. 1 మ్యాచ్‌లో ఫలితం లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ ఐదుసార్లు తలపడ్డారు. దక్షిణాఫ్రికా మూడుసార్లు, పాకిస్థాన్ రెండుసార్లు గెలిచాయి. 1992, 1996, 1999లో దక్షిణాఫ్రికా గెలుపొందగా, 2019, 2015లో జరిగిన చివరి రెండు ప్రపంచకప్ మ్యాచుల్లో పాకిస్థాన్ గెలుపొందింది.
ఈరోజు చెన్నై(Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ పేస్, బౌన్స్‌తో బ్యాటర్లకు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. మంచి స్కోరు చేసే అవకాశం ఉందన్నారు. కానీ స్పిన్నర్ల విషయంగా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ స్టేడియం ఇప్పటివరకు 27 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15 సార్లు గెలుపొందగా, స్కోరును ఛేదించే జట్లు 11 సందర్భాలలో గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే గూగుల్ గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచే అవకాశం 62% ఉందని అంచనా(prediction) వేసింది. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.