ADB: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 3న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలను అందజేయాలని కోరారు.