»Amit Shah Participates Jana Garjana Sabha In Suryapet
Amit Shah: బీజేపీ ప్రజల పార్టీ.. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ
తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని ఆయన అన్నారు.
Amit Shah: తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని ఆయన అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని అమిత్ షా బహిరంగంగా ప్రశ్నించారు. కుటుంబ పార్టీలు ఎప్పటికీ తెలంగాణను అభివృద్ధి చేయలేవన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్, రాహుల్ ను ప్రధానిని చేయాలని సోనియా అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పేదలు, దళితుల వ్యతిరేక పార్టీ అన్నారు. పేద వారి కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఒక్కొక్కరికీ నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్నామన్నారు.దళిత ముఖ్యమంత్రి అంటూ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. బీసీ ల సంక్షేమం కోసం 10,000 కోట్లు అని ఎందుకు వదిలేశావ్ అని ప్రశ్నించారు. బీసీ ల సంక్షేమం కోసం బీసీ కమిషన్ వేసింది మోడీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. తెలంగాణ లో గిరిజనుల అభివృద్ధిని చూసుకునేది బీజేపీ మాత్రమేనన్నారు. పసుపు రైతుల కోసం నరేంద్ర మోడీ పసుపు బోర్డ్ ఏర్పాటు చేశారన్నారు. కిసాన్ సమ్మాన్ నిధుల కింద రాష్ట్రానికి 90వేల కోట్లు ఇచ్చిన ఘనత కేంద్రానిదే అన్నారు.
అయోధ్యలో రామజన్మభూమిలో రామ మందిరం నిర్మించాలా వద్దా? 500 సవత్సరాల నాటినుంచి అయోధ్యలో పోరాడుతున్నాం. జనవరి నాటికి ఆలయంలో ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారన్నారు. సూర్యాపేట ప్రజలు అందరు రామ మందిరం చూడడానికి రావాలన్నారు. మోడీకి మద్దతుగా తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అమిత్ షా ఓటర్లను కోరారు.