»Pm Narendra Modi To Distribute 51000 Appointment Letters Pm Rozgar Mela To Newly Inducted Recruits In Government Departments
PM Rozgar Mela: దీపావళికి ప్రధాని కానుక.. 51,000మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
దీపావళికి ముందే ప్రధాని మోడీ శుభవార్త ప్రకటించారు. శనివారం( 2023 అక్టోబరు 28) జరిగే ఉపాధి మేళాలో ప్రభుత్వ శాఖల్లో నియమితులైన 51,000 మంది యువతకు నియామక పత్రాలను ఆయన పంపిణీ చేయనున్నారు.
PM Rozgar Mela: దీపావళికి ముందే ప్రధాని మోడీ శుభవార్త ప్రకటించారు. శనివారం( 2023 అక్టోబరు 28) జరిగే ఉపాధి మేళాలో ప్రభుత్వ శాఖల్లో నియమితులైన 51,000 మంది యువతకు నియామక పత్రాలను ఆయన పంపిణీ చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసే ఈ ఎంప్లాయిమెంట్ మేళా కార్యక్రమంలో మధ్యాహ్నం 1 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో మొత్తం 37 చోట్ల ఉపాధి మేళా నిర్వహించనున్నారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు ఈ ప్రచారానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్తగా నియమితులైన ఉద్యోగులు రైల్వే మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, హోం మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, ఉన్నత విద్యా శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వంటి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వారు.
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ ఉపాధి మేళా ఒక పెద్ద ముందడుగు. జాబ్ మేళా ఉపాధి కల్పనలో మరింత ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం భారీ అవకాశాలను అందిస్తుంది. నియమించబడే ప్రభుత్వ ఉద్యోగులు iGOT కర్మయోగి పోర్టల్లో ఆన్లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభం ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని పొందుతారు. 750కి పైగా ఈ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉద్యోగులు దీనితో ఎక్కడి నుండైనా, ఏదైనా పరికరం ద్వారా కనెక్ట్ అవ్వవచ్చు. వచ్చే ఏడాదిన్నర కాలంలో అంటే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 10 లక్షల మందికి మిషన్ మోడ్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని 2022 జూన్లో ప్రధాని ప్రకటించారు. జూన్ 2022లో అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రధానమంత్రి స్వయంగా సమీక్షించారు. ఆ తర్వాత రిక్రూట్మెంట్ నిర్ణయం తీసుకున్నారు.