AP: పరిశ్రమల స్థాపనకు విశాఖ అనుకూలమైన ప్రాంతమని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఏఐ, డిజిటల్ సిటీకి రాజధానిగా విశాఖ మారనుందని తెలిపారు. ‘దేశంలో అత్యుత్తమమైన 26 పాలసీలు రూపొందించినట్లు తెలిపారు. పరిశ్రమలకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తున్నాం. గత ఐదేళ్ల కంటే.. 16 నెలల్లోనే అధిక పెట్టుబడులు వచ్చాయి. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదు’ అని పేర్కొన్నారు.