PPM: జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ రిటైర్డ్ జస్టిస్ వి.రామ సుబ్రహ్మణియన్ను అరుకు ఎంపీ డా.తనూజా రాణి ఆధ్వర్యంలో సోమవారం గిరిజన ప్రతినిధులు కలిశారు. పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు జరిగిన కలుషిత నీటి ఘటనను వివరించినట్లు ఎంపీ తెలిపారు. ఎంపీ డా.తనూజారాణితో పాటు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు.