KDP: కడప నియోజకవర్గంలో 7 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 5,91,586 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అందజేశారు. వారు మాట్లాడుతూ.. లబ్ధిదారుల కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో కూడా సహాయం అందించడానికి ఎన్డీఏ కూటమి ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.