సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ప్రజల అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన మొత్తం 237 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రతి విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారం చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.