ప్రకాశం: జరుగుమల్లి మండలంలోని చింతలపాలెం రైతు సేవా కేంద్రాన్ని మండల ఏవో కాశీ విశ్వనాధ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. జరుగుమల్లి మండలంలో మొత్తం యూరియా 185 టన్నులు, DAP- 81 టన్నులు, కాంప్లెక్స్ (20:20:0:13)-73 రైతులకి అందుబాటులో ఉందని అన్నారు. అదేవిధంగా రైతులకి నానో యూరియా వాడకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.