పాక్తో తాజా ఉద్రిక్తతలపై ఆఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ స్పందించారు. పాకిస్తాన్ తప్ప.. పొరుగుదేశాలన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయని తెలిపారు. తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదన్నారు. ఆఫ్గాన్లో శాంతి ఉందన్నారు. పాక్ మాత్రమే తమ పొరుగుదేశం కాదని, మరో ఐదు దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అవన్నీ తమతో సంతోషంగానే ఉన్నాయన్నారు.