TG: రాష్ట్ర వ్యాప్తంగా 106 మంది ఇంజినీర్లను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. NOCల జారీ విషయంలో ఇంజినీర్లు.. క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇందుకోసం సమూల ప్రక్షాళన చేసేందుకు ఈ బదిలీలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, NOCలతో పలువురు ఇంజినీర్లు భారీగా అక్రమ డబ్బు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయి.