E.G: ఇసుక ఆపరేషన్లలో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని, ప్రజల సంతృప్తి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జేసీ వై.మేఘా స్వరూప్‌తో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఇసుక లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.