E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ నూతన కమిషనర్ రాహుల్ మీనా బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక సంస్థలోని పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సౌకర్యాల మెరుగుదల, శానిటేషన్ & మౌలిక సదుపాయాలపై చర్చించారు.