AP: కాకినాడ సెజ్ రైతులకు భారీ ఊరట లభించింది. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాల భూములను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల వేళ రైతులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.