TG: యువ మహిళా క్రికెటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బంపరాఫర్ ఇచ్చింది. భారత్ అండర్-19 ఉమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్ణావకాశం కల్పించింది. ఇందుకోసం రేపు, ఎల్లుండి ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఉప్పల్ స్టేడియంలోని ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లడించింది.