KDP: చక్రాయపేట మండలం గండిక్షేత్రం శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయల విక్రయాలు, వివాహాలు జరిపించడం, ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ సప్లయర్స్‌కు సంబంధించి వేలం జరుగుతుందన్నారు. కాగా, ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహిస్తారు.