ప్రకాశం: కర్నూల్లో పీఎం నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను డోన్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా అధిష్టానం నియమించింది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జైసూర్య ప్రకాశ్ రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దామచర్ల మాట్లాడుతూ.. పీఎం పర్యటనను నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు.