ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైసీపీ నాయకులు నకిలీ మద్యంపై మంగళవారం నిరసన చేపట్టారు. వైయస్సార్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చి, నకిలీ మద్యం తయారుచేసి ప్రజల ప్రాణాలు తీస్తుందని వైసీపీ నాయకులు ఆరోపించారు.