JN: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యార్థులకు బోధనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారు మాట్లాడారు. వీసీలో జనగామ జిల్లా కలెక్టర్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు.