NZB: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం కలిసి వినతి పత్రం ద్వారా కోరారు. పూర్తయిన పనుల ప్రారంభోత్సవం, మంజూరైన పనుల శంకుస్థాపనలకు మంత్రిని నియోజకవర్గానికి ఆహ్వానించారు.