ELR: జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఇవాళ ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు వాటి నుంచి బయటపడేలా, అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. భద్రతా చర్యలపై ప్రతి ఫ్యాక్టరీ నుంచి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు.