MBNR: అడ్డాకుల మండలంలోని అన్ని గ్రామాల్లో రేపటి నుంచి నవంబర్ 14 వరకు గాలి కుంటు (ఎఫ్ఎండీ) నివారణ టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు మండల పశువైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. ప్రతి గ్రామంలో పశువైద్య బృందాలు పర్యటించి పశువులకు టీకాలు వేస్తామని చెప్పారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.