PLD: నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కోరారు. ఈ కుంభకోణంపై ఇవాళ నరసరావుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నకిలీ మద్యం తయారీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలన్నారు.