ELR: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించడం ద్వారా ఎవరైనా వారిపై నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే వారు వెంటనే పసిగట్టేందుకు వీలుంటుందని ఏఎస్పీ నక్కసూరి చందర్రావు అన్నారు. ఏలూరు అమీనా పేటలోని ఓ స్కూల్లో శక్తి టీం ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఏఎస్పీ విద్యార్థినులకు శక్తి యాప్ గురించి వివరించారు.