SKLM: జీ. సిగడాం మండలం మెట్టవలస గ్రామానికి చెందిన రైతు మిత్ర సంఘం వారికి వ్యవసాయ శాఖ సబ్సిడీ ద్వారా కేటాయించిన కిసాన్ డ్రోన్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రోన్ సాయంతో ఎరువులు, పురుగు మందులు, బయో ఫర్టి లైజర్లు తక్కువ ఖర్చుతో సులభంగా పిచికారీ చేయవచ్చని అన్నారు.