శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గనగలవానిపేట గ్రామంలో గౌరమ్మ సంబరాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేని శాలువతో సత్కరించారు. అనంతరం గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.