WNP: వనపర్తిలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు కఠిన నిబంధనలు పాటించాలని ఎస్సై హరిప్రసాద్ సూచించారు. జనసమ్మర్ధం లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే దుకాణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత రుసుము చెల్లించి, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక శాఖల NOC అనుమతి తప్పనిసరి. ఈ లైసెన్స్ కేవలం మూడు రోజులకు మాత్రమే చెల్లుతాయన్నారు.