మన్యం: పాలకొండ పట్టణంలో రాజాం రోడ్లో అన్నవరం వద్ద షిరిడి సాయిబాబా ఆలయం దగ్గర ఉన్న ఐరన్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. గణేష్ అనే వ్యక్తికి చెందిన ఈ షాపు తాళాలు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో ఆయన వచ్చేసరికి రూ 2.50.00 విలువైన వస్తువులు పోయినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.